టీడీపీకి మెట్టు గోవింద్ రెడ్డి రాజీనామా.. ఆయన ఇంటికి వెళ్లిన వైసీపీ నేతలు

  • రాయదుర్గం టికెట్ మంత్రి కాల్వకు ఖరారు
  • మెట్టు గోవింద్ రెడ్డితో భేటీ అయిన వైసీపీ నేతలు
  • వైసీపీ నుంచి పోటీ చేసే అవకాశం
అనంతపురం జిల్లా టీడీపీలో టికెట్ల కేటాయింపులు చిచ్చు రేపుతున్నాయి. రాయదుర్గం ఎమ్మెల్యే టికెట్ ను మంత్రి, సిట్టింగ్ ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులుకు ముఖ్యమంత్రి చంద్రబాబు కేటాయించారు. ఈ నేపథ్యంలో పార్టీకి రాజీనామా చేస్తామని ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మెట్టు గోవింద్ రెడ్డిలు హెచ్చరించారు. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన ఎంపీ దివాకర్ రెడ్డి, కాల్వ శ్రీనివాసులు ఇద్దరినీ బుజ్జగించే ప్రయత్నం చేశారు.

మెట్టు గోవింద్ రెడ్డితో జేసీ, కాల్వ చర్చలు విఫలమయ్యాయి. దీంతో టీడీపీకి మెట్టు గోవింద్ రెడ్డి రాజీనామా చేశారు. అనంతరం మెట్టు నివాసానికి వైసీపీ నేతలు వెళ్లి, చర్చలు జరిపారు. రానున్న ఎన్నికల్లో వైసీపీ తరపున మెట్టు పోటీ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
Go Back to Shorts
mettu govind reddy
Telugudesam
ysrcp
rayadurg

More Telugu News